జనసేన లోకి చేరనున్న రెబెల్ స్టార్ భార్య

ఏపీలో జ‌రుగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మదైన వ్యూహాల‌తో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్ప‌టికే ఒక‌వైపు టీడీపీ.. మ‌రోవైపు వైసీపీ నువ్వా నేనా అన్న‌ట్టు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నేను కూడా ఉన్నానంటూ దూసుకొచ్చింది జ‌న‌సేన. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో బ‌రిలోకి దిగ‌నున్నామ‌ని ఇప్ప‌టికే జ‌న‌సేన ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లో భాగంగా ప‌లు జిల్లాలు ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌ యాత్ర‌లో భాగంగా జ‌న‌సేన నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో ప‌వ‌న్.. టీడీపీ, వైసీపీల పై విరుచుకు ప‌డుతూ జ‌న‌సేన మైలేజ్ పెంచుకుంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాప‌క్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది నాయ‌కులు జ‌న‌సేన వైపు చుస్తున్నారు.

ఇటీవ‌ల ఉమ్మ‌డి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా ప‌లువురు నేత‌లు జ‌న‌సేన‌లో చేరారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ నేత రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే వార్త‌లు రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆమె జ‌న‌సేన త‌రుపున‌ న‌ర‌సాపురం అసెంబ్లీ నుండి పోటీ చేయ‌నున్నార‌ని.. ఈ విష‌యం పై చ‌ర్చ‌లు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇది  నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ లేపుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*