ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు.. 12 మంది మృతి….!

ర్యాట్ ఫీవర్ తో వణికిపోతున్న కేరళ.. 372 కేసులు 12 మంది మృతి….!న్భారీ వర్షాలు, వరదలతో కుదేలైన కేరళకు మరో ప్రమాదం ఎదురైంది. ‘ర్యాట్ ఫీవర్‌’ ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ఒక ఆగస్టు నెలలోనే 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఆరుగురు గత ఆరు రోజుల్లోనే మృతిచెందారు. ఆగస్టు 8 నుంచి శతాబ్దంలోనే కనీవిని ఎరుగని భయంకర వర్షాలు కేరళను కుదిపేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రాష్ట్రంలో మొత్తం 372 ర్యాట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 54 మంది ఈ వ్యాధి కారణంగానే మరణించినట్లు అనుమానిస్తున్నారు. 

వైద్య పరిభాషలో లెఫ్టోస్పిరోసిస్ అని పిలిచే వ్యాధిని ‘ర్యాట్ ఫీవర్’ అని కూడా అంటారు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి కొత్తేం కాకపోయినా.. వరదల కారణంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది జనవరి, జులై మధ్య కేరళలో ర్యాట్ ఫీవర్ కారణంగా 28 మంది బలయ్యారు. 

 

భయానక ర్యాట్ ఫీవర్.. కిడ్నీ, లీవర్, మెదడు తదితర శరీరంలోని ప్రధాన భాగాలపై ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. వ్యాధి బారిన పడ్డ వ్యక్తుల ఒక్కో అవయవం దెబ్బతినడం వల్ల పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ర్యాట్ ఫీవర్ విజృంభిస్తుండటం కేరళవాసులు ఆందోళన చెందుతున్నారు. 

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పునర్నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. కానీ, నేటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కేరళలో పరిస్థితులు చక్కదిద్దడానికి రూ. 30 కోట్లు అవసరమౌతాయని అంచనా. కేరళను ఆదుకునేందుకు ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. సామాన్యులు కూడా ముందుకు కదిలారు. ఇటీవల ఓ యాచకుడు కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తన వంతుగా రూ. 94 సాయం చేయడం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*