సుకుమార్ కథ వల్లె ఇదంతా…!

రంగస్థలం సినిమా ఇంత గొప్ప విజయవంతం కావదానికి అంతా దర్శకుదు సుకుమార్ వల్లనే అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఇది ఒక వ్యక్తి కల అని, ఆ వ్యక్తి సుకుమార్ అని  వెల్లడీఁచారు. ఎ సినిమా విజయం వెనుకయిన ఒక వ్యక్తి ఆలోచన ఉంటుదని ఆ ఆలోచనను పెన్ను తీసి పేపర్ మీద ఎప్పుడైతే పెడతాడో అప్పటినుంచి ఒక గొప్ప సినిమా కానీ, సబ్జెక్ట్ కానీ మొదలవుతుందని హీరో రామ్ చరణ్ చెప్పారు.

ఆ ఒక వ్యక్తి ఆలోచన వల్లే నేనున్నాను, రత్నవేలు ఉన్నారు, మా నిర్మాతలున్నారు, ఇంత మంది గొప్ప నటులున్నారు. మేమంతా కలిసి పనిచేశామంటే కారణం  ఆ ఒక వ్యక్తి ఆలోచన స్థాయి. ఆ స్థాయే మమ్మల్ని 100 రోజుల వరకు తీసుకొచ్చింది. ఆ వ్యక్తి(సుకుమార్)కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను’ అని సుకుమార్‌ను రామ్ చరణ్ ఆలింగనం చేసుకున్నారు.

 రంగస్థలం మూవీ 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని పురశ్కరించుకొని హైదరాబాద్ లోఆదివారం రంగస్థలం 100 రోజుల సంబరాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమమం లో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ నీ ఇలా పొగడ్తలతో మొంచెత్తారు.

 ఈ కార్యక్రమం లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్లకు 100 రోజుల మెమొంటోలను అందించారు. నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు. మనం ఎదిగేటప్పుడు మనతో పాటు 10 మందిని పైకి తీసుకెళ్లాలి అని. ఒకవేల మనం పడిపోతే ఆ 10 మందే మనల్ని కాపాడతారు. కాబట్టి మా పరిశ్రమను, మమ్మల్ని కాపాడేవారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లు సంతోషంగా ఉంటే మేమంతా సంతోషంగా ఉంటాం.

మీ (డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు) అందరికీ మంచి లాభాలు రావడం చాలా సంతోషకరం. ఒక సినిమా.. థియేటర్ వరకు వెళ్లి అది విజయం సాధించడానకి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే కారణం. అందుకే వాళ్లను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ చాలా బాగా మాట్లాడారు. ‘ఎన్ని సార్లు చెప్పినా కొంచెం బోరింగ్‌గా ఉంటుంది కానీ.. విషయం చిన్నదైనా, పెద్దదైనా మన గురువుల నుంచి నేర్చుకుంటాం. తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. వాళ్లను గుర్తుతెచ్చుకోకుండా మనం ఉండలేం. మా సినిమానే కాదు.. రేపొచ్చే సినిమాలన్నీ మీకు మంచి లాభాలు తేవాలని, ఇండస్ట్రీ ఎంతో బాగుండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని రామ్ చరణ్ ముగించారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*