అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి:రకుల్

అభిమానులకు  బర్త్ డే గిఫ్ట్ గా బయోపిక్ శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో రకుల్ శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుండి మరో ఇంట్రస్టింగ్  పోస్టర్‌ను పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి  శ్రీదేవి పాత్రకు గానూ గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

కావున బుధవారం నాడు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెల్లటి చీరలో ‘వేటగాడు’ చిత్రంలోని ఆకుచాటు పింద తడిచే సాంగ్ కాస్ట్యూమ్స్ లో అలనాటి అందాల తారను గుర్తు చేస్తూ అదిరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది గ్లామర్ దాల్ రకుల్. విశ్వవిఖ్యాత  ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్‌లో దాదాపు 14 సినిమాలు విడుదలయ్యాయి.

వాటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వారిద్దరిది హిట్ కాంబినేషన్ అయ్యింది. ఇక ‘వేటగాడు’ చిత్రంలోని ఆకుచాటు పింద తడిచే సాంగ్ సన్సేషనల్ హిట్ అయ్యింది. తాజాగా ఇదే సాంగ్‌ను బాలయ్య-రకుల్‌పై చిత్రీకరించనున్నారు. అందులోని భాగమే ఈ పోస్టర్. ఆ హిట్ కాంబినేషన్ లాగా ఈ కాంబినేషన్ కూడా అభిమానులను అలరిస్తుందేమో చూడాలి మరీ….!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*