త్రివిక్రమ్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ప్రభిభను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు.

‘యుద్ధం తర్వాత ఏమి జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాని ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా తెరకెక్కించాడు. ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ చూపిన అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జగపతి బాబు నటన అద్భుతంగా ఉంది’ అని ట్విట్ లో పేర్కొన్నాడు రాజమౌళి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*