కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం:రియల్ స్టోరి

కొత్తగా జత కట్టబోతున్న రాశిగోవిందం. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఓ వైపు యూత్ విజయ్ పేరెత్తితేనే వెర్రెత్తి పోతుంటే – మరోవైపు అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత విజయ్ వంద సినిమాలు చేయడం ఖాయం అంటూ రీసెంట్ గా కితాబిచ్చాడు.  రేపు విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ సినిమా రిలీజ్ అవుతోంది. అడ్వాన్సు బుకింగుల రచ్చ ఆల్రెడీ పీక్స్ లో ఉంది.

మరి ఇలాంటి హీరో నటించే సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకోవాలి కదా.  ప్రస్తుతం రాశి ఖన్నా పరిస్థితి అలానే ఉందట.  డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో విజయ్ చేయబోయే సినిమాలో రాశి ని హీరోయిన్ గా ఎంపిక  చేశారట.  విజయ్ ప్రస్తుతం ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటిస్తున్నాడు.  ఈ సినిమాల తర్వాత క్రాంతి మాధవ్ సినిమా ఉంటుంది. 

ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై KS రామారావు నిర్మిస్తారట.  అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం.  ఆలోపు  ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ను కంప్లీట్ చేస్తాడట.  విజయ్ – క్రాంతి మాధవ్ సినిమా ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట.  రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా క్రాంతి మాధవ్ ఈ సినిమా కథ తయారు చేసుకున్నాడని సమాచారం.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*