వైసీపీలో చేరిన ప్రముఖ నిర్మాత పీవీపీ

టీడీపీకి కాకినాడ ఎంపీ తోట నరసింహం రాజీనామా చేసి, వైసీపీలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నేడు భార్య వాణితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి.. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తోట నరసింహం దంపతులు మీడియాతో మాట్లాడారు. తనకు టీడీపీలో చాలా అవమానం జరిగిందని తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెద్దాపురం వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్టు తోట వాణి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరినా టీడీపీలో పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కూడా నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణుతో కలిసి ఈరోజు ఉదయం ఆయన లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు. జగన్‌తో భేటీ అనంతరం పీవీపీ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేద్దామని వచ్చానన్నారు. జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుంది అని నమ్ముతున్నానని పీవీపీ తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నానని పీవీపీ స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*