అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక…..!

 

అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక ఎందుకంటే అమెరికా బ్రిటన్ లో కెరీర్ కోసమని పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా లైఫ్ టైమ్ జాక్ పాట్ కొట్టేసింది. ఇండియాలో ఉంటే లైఫ్ లో సెటిలయ్యేదో లేదో తెలీదు కానీ విదేశాలు వెళ్లి గొప్ప ఘనకార్యమే తలపెట్టింది. ఆ ఘనకార్యం పేరే నిక్ జోనాస్. బ్రిటన్ నటుడు నిక్ తో కొన్నినెలల నుంచి డేటింగ్ సాగించిన పీసీ చివరికి నిశ్చితార్థం కూడా చేసుకుంది. వన్ ఫైన్ డే పీసీ బర్త్ డే రోజు నిక్ జోనాస్ తనకు ప్రపోజ్ చేయడమే గాక నిశ్చితార్థపు అంగుళీకాన్ని తొడిగేశాడు.

ఇంతకీ ఆ అంగుళీకాన్ని ఎక్కడ కొన్నాడో తెలుసా? న్యూయార్క్ లోని ఖరీదైన టిఫానీ స్టోర్ లో అతడు ఈ రింగ్ ని కొన్నాడు. అదంతా సరే ఇంతకీ ఆ రింగ్ పీసీ వేలికి ఉందా?  లేదా? అంటే ప్రస్తుతం మాత్రం కనిపించడం లేదు. నిక్ జోనాస్ తో పాటు ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి అది మాయమైంది. పీసీ ఇలా విమానం దిగిందో లేదో అలా కెమెరా కళ్లు పీసీ చేతి వేలి ఉంగరంపై పడ్డాయి. ఇంకేంముంది చకచకా ఆ ఉంగరంపై ఫ్లాష్ లు మెరిసాయి. ఆ హడావుడి చూసి బెదిరిపోయిన పీసీ వెంటనే ఆ ఉంగరాన్ని వేలి నుంచి తీసి దాచేసింది.

ఆమె గుట్టు ఎక్కడ అందరికీ తెలుస్తుందనే భయంతోనే అలా చేసి ఉండొచ్చు. ఉన్నట్టుండి పెళ్లి అంటే తనకు భారీ అవకాశాలు చేజారొచ్చు కాబట్టి ఇలా చేసిందో, పెళ్లి బాజా మోగే వేళ ఇంకా సందేహమెందుకు. పీసీ తన లవర్ నిక్ ని అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లాడే ఛాన్సుందని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అదంతా సరే ఇంత జరిగాక కూడా పీసీ ఇంకా ఎందుకిలా నిశ్చితార్థపు ఉంగరం దాచేస్తోంది? ఇటీవలే సల్మాన్ `భరత్` సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా చెప్పాక కూడానా ఎందుకిలా..!

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*