Prem Ratan Dhan Payo earns Rs 100 crore in 3 days

                    చెత్త సినిమాలకు 100 కోట్లు

సౌత్‌ ఇండియాలో వరుసగా పలు చిత్రాలు 100 కోట్ల క్లబ్‌లో చేరి పోతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు తెలుగులో ఒక్క 100 కోట్ల చిత్రం లేదని చింతించిన తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ‘బాహుబలి’ మరియు ‘శ్రీమంతుడు’ చిత్రాలు ఆ లోటును తీర్చాయి. ఇక తమిళంలో వంద కోట్ల సినిమాలు సర్వ సాధారణం అయ్యాయి. ఇక బాలీవుడ్‌ విషయానికి వస్తే చెత్త సినిమాలు సైతం 100 కోట్లను రాబడుతూ ఉన్నాయి.

salman khan

కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో కూడా ఒక సినిమా 100 కోట్లను సాధించడం అసాధ్యం అయ్యేది. అయితే రాను రాను బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు 100 కోట్లను దక్కించుకుంటూ వచ్చాయి. ఇక గత సంవత్సరం నుండి స్టార్‌ హీరోలు నటించి, ఫ్లాప్‌ అయిన సినిమాలు కూడా 100 కోట్లు రాబడుతున్నాయి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు నటించిన సినిమాల మినిమం కలెక్షన్స్‌ ప్రస్తుతం 100 కోట్లుగా ఉన్నాయి అంటూ అతిశయోక్తి కాదు. తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘ప్రేమ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయినా కూడా మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టింది. దీన్నో పెద్ద రికార్డుగా బాలీవుడ్‌ వారు చెప్పుకోవడం లేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి వంద కోట్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ చిత్రం అంటే 500 కోట్లు వసూళ్లు చేయాలి. అప్పుడే అదో భారీ సక్సెస్‌ చిత్రంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల్లో ఈ 500 కోట్లు కూడా సర్వ సాధారణం అవుతుందేమో చూడాలి. .

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*