పింక్ డైమండ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

పింక్ డైమండ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!ఎంతో అందమైన, అత్యంత అరుదైన గులాబీ రంగు వజ్రం ‘పింక్‌ లెగసీ’ రికార్డు సృష్టించింది. వేలంలో భారీగా 50 మిలియన్‌ డాలర్లు పలికిన అరుదైన ఘనత సాధించుకుంది. మంగళవారం (నవంబరు 13) రాత్రి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన వేలంలో ఈ 19 క్యారెట్‌ పింక్‌ డైమండ్‌ను అమెరికాకు చెందిన హ్యారీ విన్ స్టన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ అరుదైన వజ్రం వేలంలో 50 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.360 కోట్లు) పలికిందని దాన్ని వేలం వేసిన సంస్థ క్రిస్టీస్‌ వెల్లడించింది. ఈ తరహా వజ్రాలలో అత్యధిక ధర పలికిన వజ్రంగా ఇది రికార్డు సృష్టించింది. 19 క్యారెట్ల బరువైన ఈ డైమండ్‌ ఒక్కో క్యారెట్‌కు 2.6 మిలియన్‌ డాలర్లకు పలికిందని, అయితే పింక్‌ డైమండ్లలో గతంలో ఎన్నడూ క్యారెట్‌కు ఇంత ధర పలకలేదని క్రిస్టీస్‌ తెలిపింది.

 

 

ఈ వజ్రాన్ని దక్కించుకున్న అమెరికా సంస్థ వజ్రానికి వెంటనే ‘ఖవిన్‌స్టన్‌ పింక్‌ లెగసీ’గా పేరు మార్చింది. ఈ అరుదైన వజ్రం దక్షిణాఫ్రికాలో సంపన్నులైన ఓపెన్‌ హైమీర్‌ కుటుంబానికి చెందినది. దాదాపు శతాబ్దం క్రితం ఈ వజ్రం దక్షిణాఫ్రికా గనుల్లో లభ్యమైంది. 1920లో దీన్ని సానపట్టారనీ, అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేపట్టలేదని వెల్లడించింది. గతేడాది నవంబరులో హాంకాంగ్‌లో జరిగిన వేలంలో 15 క్యారెట్ల బరువైన పింక్‌ డైమండ్‌ 32.5 మిలియన్‌ డాలర్లు (రూ.234 కోట్లు) పలకగా జాగా పింక్ లెగసీ దాన్ని అధిగమించిందని క్రిస్టీస్ సంస్థ పేర్కొనింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*