మొటిమలతో అందంగా మరో కొత్త హీరోయిన్….ఎవరో తెలుసా……..!

ఈ మధ్య మొటిమలు ఉండటం బాగా స్టైల్ అయిపోయింది. మన సౌత్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూడటం చాలా తక్కువ. ప్రయోగాత్మక సినిమాల్లోనే అలా చూపిస్తారు కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కానీ ప్రేమ కథల్లో కానీ హీరోయిన్ అందంగా ఉండి తీరాలి. ఈ స్టేట్ మెంట్ కి ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అర్థం మార్చేసింది. తన మొహం మీద మొటిమలను ఏ మాత్రం దాచకోకుండా అది కూడా అందంలో భాగమేనంటూ తన నటన ద్వారా అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి తీరు ఇప్పుడు అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు తెచ్చి పెడుతున్నాయి.

తాజాగా ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరేలా ఉంది. సుశాంత్ హీరోగా రూపొందుతున్న చిలసౌ సినిమాలో పరిచయమవుతున్న రుహాని  శర్మకి కూడా కుడి బుగ్గ మీద మొటిమలు ఉండటాన్ని టీజర్ లో గమనించిన ప్రేక్షకులు ఇవి నిజంగా ఉన్నవా లేక  సినిమా కోసం  అతికించారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఈమె కూడా సాయి పల్లవినీ ఫాలో అవుతుందనిపిస్తోoది.  కానీ ప్రమోషన్ ఈవెంట్ లో రుహాని ని చూసినప్పుడు కాస్త క్లారిటీ రావొచ్చు. ఇదంతా పుకార్లో లేదో తెలుసుకోవచ్చు.

చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని సుశాంత్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలను పెంచే పనిలో ఉంది అన్నపూర్ణ బ్యానర్. నాగ చైతన్య దీని గురించి ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆ సినిమా నచ్చడం వల్లే తమ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నామని ప్రకటించడం చూసాం. మ్యారేజ్ బాక్ డ్రాప్ లో రూపొందిన చిలసౌ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఆ డేట్ ఫిక్స్ చేసారు కానీ సాక్ష్యం లాంటి సినిమాలు పోటీ ఉన్న నేపధ్యంలో ఏదైనా మార్పు చేసుండవచ్చు. రుహాని శర్మ దీని మీద ఎక్కువ ఆశలే పెట్టుకుంది. ఈమె కూడా గ్లామర్ షోకు దూరంగా హోమ్లీ పాత్ర ద్వారా పరిచయమవుతున్న  ఈ బ్యూటీకి ఇది కనుక హిట్ అయితే అవకాశాలు వెల్లువెత్తుతాయి అనడంలో అనుమానం అక్కర్లేదు. ఈమె కూడా సాయి పల్లవి రేoజ్ లో పాపులర్ అవ్వడంలో ఆశ్చర్యం లేకపోలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*