పైలట్ల సిక్ లీవ్.. విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా…!

పైలట్ల సిక్ లీవ్.. విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా…!ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ ఆదివారం 14 విమానాలు రద్దు చేసింది. రుణ భారంతోపాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక జెట్‌ ఎయిర్‌వేస్‌ నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా నిన్న కొందరు పైలట్లు ఆరోగ్యం బాగోలేదని ‘సిక్‌’ లీవ్‌ పెట్టారు. దీంతో పైలట్లు అందుబాటులో లేక విమానయాన సంస్థ ఏకంగా 14 విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేతనాలు సరిగ్గా చెల్లించకపోవడం వల్లే పైలట్లు సిక్‌ లీవ్‌ పెట్టారని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. సెప్టెంబరు నెల జీతంలో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించి, అక్టోబరు, నవంబరు జీతాలు పైసా కూడా ఇవ్వలేదు. వేతనాలు సరిగా చెల్లించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు.

 

 

ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లినా నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) ప్రవర్తన సరిగా లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు అనేది సంబంధిత వర్గాల సమాచారం. జెట్‌ ఎయిర్‌వేస్‌ దేశీయ పైలట్ల సంఘం (ఎన్‌ఏజీ)లో వెయ్యి మందికి పైగా పైలట్లు ఉన్నారు. విమానాల రద్దుపై జెట్‌ ఎయిర్‌వేస్‌ స్పందించింది. ఊహించని నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దయ్యాయని, పైలట్ల నిరసన వల్ల కాదని తెలిపింది. రద్దైన విమానాల్లోని ప్రయాణికులకు ఫ్లైట్‌ స్టేటస్‌ గురించి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సందేశాలు పంపామని, కొందరికి వేరే విమానాల్లో ప్రయాణానికి ఏర్పాటు చేశామని, మరికిందరికి నగదు తిరిగి ఇచ్చేశామని వెల్లడించింది.

 

కంపెనీకి పైలట్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది నుంచి తగిన మద్దతు ఉందని పేర్కొంది. కంపెనీ ఉద్యోగుల జీతాలు చెల్లించే విషయంపై, సమస్యను పరిష్కరించేందుకు వారితో చర్చలు జరుపుతూనే ఉందని జెట్ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. అయితే, వేతనాల చెల్లింపు విషయమైన ఆ సంస్థ ఛైర్మన్ నరేశ్ గోయల్‌కు లేఖ రాశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పనిచేయలేమని అందులో స్పష్టం చేశారని సమాచారం. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*