కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్ తుఫాన్

కాట్రేనికోన వద్దతీరాన్ని తాకిన పెథాయ్ తుఫాను.. ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకుగురిచేస్తున్న పెథాయ్ తుఫాను కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. అమలాపురంకి 20 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుఫాను తీరాన్ని తాకండంతో ఆ ప్రాంతాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫానుకారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. తుఫానుప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి.

 ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుఫాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. తీరప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*