తెలంగాణా కొత్త జిల్లాలకు కోత విదించిన కేంద్రం ….! ఇదంతా వాస్తవమేనా…?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన పరంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన మొట్ట మొదటి అతి పెద్ద సంస్కరణ పది జిల్లాలుగా ఉన్న తెలంగాణాను వేరు చేసి 31 జిల్లాలుగా విభజించారు. ఆయా జిల్లాలకు తగ్గట్లుగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల వారిగానే ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకి వేరుగా కల్లెక్టర్లు, ఎస్పేలు ఉన్నారు. కానీ ఇప్పుడు హటాత్తుగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కేంద్రం 31 జిల్లాలకు ఆమోదం ఇవ్వలేదని కేవలం పదిహేడు జిల్లాలకు మాత్రమే ఆమోదం తెలిపారని ప్రచారం ప్రారంభమయింది. అసలు జిల్లాల్లు విభజన అనేది కేంద్ర పరిధి లోనే లేదు. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న, జిల్లాలని ఆమోదింపజేయడానికి అభ్యంతరాలు చెప్పడానికి ఇంత సమయం ఎందుకు తెసుకుంటుందో సందేహం వస్తుంది.

కేంద్రం ఆమోదముద్ర తెలంగాణా కొత్త జిల్లాలఫై లేదని ఏదో ఒక కొత్త ప్రచారం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతూనే ఉంది. గత నవంబర్ లో అసెంబ్లీ జరుగుతున్నపుడే ఇలాంటి సందేహాలకు కెసిఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కొత్త జిల్లాల అవతరణ పూర్తిగా రాష్ట్రంలోని భాగమే అన్నారు. తెలంగాణా కొత్త జిల్లాలను  ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో పొందుపర్చాల్సిన అవసరం లేదని స్వయంగా కేంద్రమే తెలంగాణా ప్రభుత్వానికి చెప్పిందన్నారు. రాష్ట్రాల్లోని జిల్లాల సమాచారం పొందుపరిచే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా 31 జిల్లాల పేర్లు పొందుపర్చినట్లు కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. కొత్త జిల్లాల సమాచారం కేంద్రంలోని ప్రతి శాఖ వద్ద ఉందని… ప్రస్తుతం  కొత్త జిల్లాల వారీగానే  ఆయా జిల్లాకు నిధులు విడుదలవుతున్నాయని, పాస్‌పోర్టులు కూడా.. కొత్త జిల్లా అడ్రస్‌లతోనే జారీ చేస్తున్నారని తెలంగాణా ప్రభుత్వం చెప్తుంది.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీఇప్పటికే 31 జిల్లాల తెలంగాణను వాడుకలోకి తెచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా  పదిహేడు జిల్లాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. దీనిపై అటు కేంద్రం నుంచి కానీ.. ఇటు రాష్ట్రం నుంచి కానీ అధికారిక ప్రకటన వస్తేనే కాస్త ఏ సందేహం లేకుండా  ఉంటుంది. లేకపోతే.. గందరగోళం కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*