వైసీపీ పై కామెంట్స్ వేసిన పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా వైసీపీ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాగంగా జ‌న‌సేన వైసీపీతో పొత్తు పెట్టుకోనుంద‌నే వార్తలు వ‌స్తున్న నేప‌ధ్యంలో తాజాగా ప‌వ‌న్ స్పందించారు. జ‌గ‌న్‌తో తాను ఎలాంటి ర‌హ‌స్య మీటింగ్ జ‌ర‌ప‌లేద‌ని, వైసీపీ లాంటి అవినీతి, చేత‌కాని పార్టీతో పెట్టుకునే అవ‌స‌రం జ‌న‌సేన‌కు లేద‌ని, ఇవ‌న్నీ టీడీపీ గ్యాంగ్ ప్ర‌చారం చేసిన త‌ప్పుడు వార్త‌ల‌ని ప‌వ‌న్ అన్నారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కీ రోల్ ప్లే చేస్తుందని, జ‌న‌సేన పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని, నేనే ముఖ్య‌మంత్రి అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే.. అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తి ఉంటే ఏపీ అభివృద్ధి చెందుతుంద‌ని మ‌ద్ద‌తు ఇస్తే.. మొత్తం రాష్ట్రాన్ని అవినీతిమ‌యం చేశారని, ఇప్పుడేమో కొడుకు లోకేష్‌ను సీయం చేయ‌డానికి కాలుగాలిన పిల్లిలా దేశం ప‌ట్టుకొని తిరుగుతున్నాడ‌ని, పంచాయితీ ప్రెసిడెంటుగా కూడా గెల‌వ‌ని లోకేష్‌ను పంచాయితీరాజ్ శాఖ‌కు మంత్రిని చేశార‌ని, చంద్ర‌బాబు వ‌య‌సు అయిపోయింద‌ని, ఏపీ స‌రైన దిశ‌లో న‌డ‌వాలంటే జ‌న‌సేన వ‌ల్లే అవుతుందని ప‌వ‌న్ అన్నారు. మ‌రి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*