Pawan Kalyan about His Fans

Pawan-kalyan-about-fans, Pawan kalyan Latest Photos
  సినిమా అంటేనే హంగు ఆర్భాటం, వ్యామోహం, ప్రచారం, బారి వ్యాపారం, కొత్త వాళ్ళనుండి కాకలు తీరిని స్టార్ హీరోల వరకు అందరు తామకు ఉన్న ఇమేజ్ ని పూర్తి గా ఉపయోగించి పెట్టిన రూపాయికి వంద రూపాయలు ఆశిస్తారు. ఇందుకు నటుడు మినహాయింపు కాదు, ఇలా చేయడం సాంఘికమూ కాదు. కేవలం అభిమానం తో ముడిపడిన వ్యాపార సూ త్రం. అభిమానించే హీరోని సొంత కుటుంబ సబ్యుని కంటే ఎక్కువగా భావించే మన తెలుగు అభిమానుల కోసం హీరో ఆలోచిస్తా(రా?)డు. అభిమానం తో ఎంతో దూరం నుండి వ్యయ, ప్రయాసాలకు ఓర్చుకొని తెర పై కనిపించే తమ వాణ్ని దగ్గరగా చూడాలని, చూసిన ఆనందం లో తడవాలని ఆడియో వేడుకలకు వస్తారు., అన్నింటిని పక్కకు తోసొచ్చిన అబిమానానికి నిరాశే మిగిలితే, అప్పుడు ఎందుకు ఆడియో ఫంక్షన్... నా అభిమానులందరికీ సరిపోయే వేదిక వెతకండి?? అప్పుడు ఆడియో ఫంక్షన్ పెట్టండి.
ఇప్పుడెలా ?? ఇది జరిగే పనేనా, కుదిరేపనేనా... వందలా , వేలా , లక్షలు, ఫంక్షన్ కి వచ్చిన అభిమానులందరికీ సరిపోయే వేదిక దొరకదు.అయితే ఆడియో ఫంక్షన్ క్యాన్సేల్ చేయండి. అవసరం లేదు.హీరో ల కోసం అభిమానులు అంతో చేస్తున్నారు, మరి అభిమానుల కోసం హీరో లు ఏం చేస్తున్నారు. చేసిన పద్దెనిమిది సినిమాలతో కోట్ల కొలది అభిమానులను సంపాదించుకోవడం సాధ్యమేనా....?? కేవలం నటన సినిమా ల తో నే కాదు , తన ప్రతి చర్య తో అభిమానుల గుండెల్లో జెండా పాతుతున్న పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాద్యం. ఆడియో ఫంక్షన్ అంటే తమ గురించి తాము గొప్పలు చెప్పుకునే వేడుక కాదు. అభిమానులకు పండగ రోజు , ఆరోజు వాళ్ళు సంతోషం గా లేనప్పుడు ఆ ఫంక్షన్ చేయడమే వృధా అని కెమరామెన్ గంగ తో రాంబాబు ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసిన పవన్ కళ్యాణ్.అభిమానుల గుండెల్లో నీ స్థానం అనంతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*