ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!

ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా నందమూరి మల్టిస్టారర్ #RRR ఈమధ్యనే లాంచ్ అయింది.  తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలు చాలానే వస్తున్నాయిగానీ ఇలా టాప్ లీగ్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించే మల్టి స్టారర్ మాత్రం ఇదేనని చెప్పవచ్చు.  ఒకరకంగా ఇది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండే అనారోగ్యకరమైన పోటీని చాలావరకూ తగ్గించే అవకాశం ఉంది. మొదటి నుండి మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్యలో భారీ పోటీ ఉండేది.  #RRR తో అది తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు గానీ కొంతమంది డై-హార్డ్ ఫ్యాన్స్ మాత్రం సినిమా లాంచ్ రోజు నుండే ఫైట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ సినిమాను #RC13 అని మెగాఫ్యాన్స్ కాదు కాదు ఇది #NTR29 అని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిబేట్లు మొదలుపెట్టారు. రెండూ నిజమే కాబట్టి ఎవరిదీ మనం తప్పని అనలేము కదా..!. 

 

 

ఇలాంటి ఇబ్బంది వస్తుందని ముందే ఊహించాడేమో గానీ జక్కన్న ఈ సినిమాకు #RRR అని నామకరణం చేశాడు. ఈ పోటీలు పెట్టుకునే కొంతమంది ఫ్యాన్స్ ను ఎవరూ ఏం చెయ్యలేరుగానీ ఒకటి మాత్రం నిజం.  సినిమా లాంచ్ రోజు చరణ్, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరోసారి అందరికీ తెలిసింది. ఇక పైనున్న ఫోటో ఒకసారి చూస్తే అసలు వాళ్ళు ఏ రేంజ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఏదో చెబుతూ ఉంటే చరణ్, రానా, ప్రభాస్, రాజమౌళి, కళ్యాణ్ రామ్, వి.వి.వినాయక్, కొరటాల శివ అందరూ ఆసక్తిగా చూస్తూ వింటున్నారు.  చరణ్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ ఎలాంటి ఇగో లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యాన్స్ సమజానికి స్నేహ సందేశం ఇస్తున్నట్లుగా ఉంది కదూ…!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*