ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలనే ఫిక్స్ ఇంకేవరూ కమిట్ కాలేదంటున్న సినీ యూనిట్

బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుగగారి ఆత్మకథను సినిమా రూపంలో చూసుకోవాలన్న కోరికను నెరవేర్చుకుంటున్న తరుణాన్ని షూటింగ్ ని ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నాడు. నెట్ లో లీక్ అవుతున్న ఫోటోల ద్వారా ఇది పూర్తిగా నట జీవితానికి సంబంధించిన బయోపిక్ అనే క్లారిటీ వచ్చేస్తోంది. ఇక ఇందులో బాలయ్య కాకుండా ఎవరెవరు కీలక పాత్రల్లో నటించబోతున్నారు అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా రానా సావిత్రిగా కీర్తి సురేష్ శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యారని సోషల్ మీడియాలో చాలా హంగామా నడిచింది.

త్వరలోనే ఎన్టీఆర్ లో ఎవరెవరు ఏయే పాత్రలు చేయబోతున్నారు అనే వివరాలు ప్రకటిస్తామని వాటికి చెక్ పెడుతూ క్రిష్ అండ్ టీమ్ చెబుతున్నారు. అధికారికంగా తాము చెప్పకుండా బయట వస్తున్నావని పుకార్లని తేల్చి చెప్పారు. ఈ లెక్కన అఫీషియల్ గా బాలకృష్ణ కాకుండా కనిపించింది విద్యా బాలన్ ఒక్కరే. నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇంటికి పిలిచి గౌరవించిన బాలయ్య ఇవాళ్టి నుంచి  తనను షూటింగ్ లో భాగం చేయబోతున్నాడు. తనదే సింహ భాగంగా ముగ్గురు నిర్మాతల్లో ఒకడిగా ఈ సినిమా తీస్తున్న బాలయ్య మేకింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. 

డిసెంబర్ చివరి వారం లోగా షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ చేతిలో ఉండాలి. రిలీజ్ టార్గెట్ చేసుకున్నా జనవరికి కేవలం 5 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.  ఇంకా కొందరు నటీనటులు ఖరారు కానీ నేపధ్యంలో ఇది సాధ్యమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ క్రిష్ మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నాడట. ఇంత కన్నా క్లిష్టమైన గౌతమిపుత్రశాతకర్ణిని 84 రోజుల్లో పూర్తి చేసిన తనకు ఎన్టీఆర్ కోసం ఇచ్చిన ఆరు నెలల సమయం సరిపోతుందని అన్నాడట. కాబట్టి డౌట్స్ అక్కర్లేదు. మరి ఇంకా  ముఖ్యమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటికి ఎవరిని తీసుకుంటారో అని అభిమానులకే కాదు అందరికీ ఆసక్తి గానే ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*