మాజి సీఎం తనయుడు కారు ఎక్కనున్నారా…!

మాజి సీఎం తనయుడు కారు ఎక్కనున్నారా…! అంటే మాజీ మంత్రి జలగం ప్రసాదరావు శనివారం (నవంబరు 3) టీఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారట. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడైన జలగం ప్రసాదరావు 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఐతే బహిష్కరణను ఎత్తివేస్తున్నట్టు శుక్రవారం (నవంబరు 2) కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినప్పటికీనూ ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారట. పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో ఆయన్ను పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు.

 

అయితే గురువారం(నవంబరు 1) తుమ్మలపల్లిలోని తన నివాసంలో అనుచరులతో ప్రసాదరావు సమావేశమైన ప్రసాదరావు ఈ నిర్ణయం తీసుకున్నారు.టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అనుచరుల అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం చెబుతానని చెప్పానని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయనకు పీసీసీ సంప్రదింపుల కమిటీ నుంచి పార్టీలోకి చేరేందుకు ఆహ్వానం వచ్చినా జిల్లాస్థాయి కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*