నర్తనశాల తెలుగు సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు : @నర్తనశాల

నటి నటులు : నాగశౌర్య, కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్, అజయ్, శివాజీ రాజా, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్ తదితరులు.

దర్శకత్వం : శ్రీనివాస్ చక్రవర్తి

నిర్మాత :  ఉష మూల్పూరి

సంగీతం : మహత్ స్వర సాగర్

కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం నర్తనశాల ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐరా క్రియేషన్స్ బ్యానర్ ఫై నగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో సమిక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

శివాజీ రాజా (కళామందిర్ కళ్యాణ్) తన తండ్రి బ్రతకాలంటే, చనిపోయిన తన తల్లి కూతురుగా పుట్టాలని కోరుకుంటాడు కాని కుమారుడు (నాగ శౌర్య) పుడతాడు. తన తండ్రి ప్రాణాలు కాపాడాలని నాగశౌర్యని అమ్మాయిలా మార్చి పెంచుతూ ఉంటాడు. దాంతో నాగ శౌర్య ఆడవారి సమస్యలను అర్ధం చేసుకుంటూ పెరుగుతాడు. అంతేకాదు ఆడవారి కోసం సెల్ఫ్ – డిఫెన్స్ సెంటర్ ని కూడా మొదలు పెట్టి అమ్మయిలు తమను తాము రక్షించుకునే విదంగా వారికి ట్రైనింగ్ ఇస్తాడు.

అలా హీరోయిన్ మానస(కశ్మీర పరదేశి) సమస్య తీర్చే క్రమంలో ఆమెను ఇష్టపడతాడు. అలాగే నగశౌర్యని సత్య భామ(యామిని భాస్కర్) ఇష్టపడుతుంది. ఇలా ఉండగా నాగ శౌర్య, యామిని భాస్కర్ ప్రేమలో ఉన్నారనుకొని శివాజీ రాజా వీళ్లిద్దరికి పెళ్లి ఖాయం చేస్తాడు.

తన పెళ్లి ఆపటానికి నాగ శౌర్య ప్రయత్నాలేవీ? తను ప్రేమించిన మనసకి జే.పి.కి ఉన్నా సంబంధం ఏంటి? అసలు నాగ శౌర్య  మానసని పెళ్లి చేసుకుంటాడా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

నాగశౌర్య గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. గే లక్షణాలున్న పాత్రలో మెప్పించాడు. అక్కడక్కడ నవ్విస్తూనే, ఇటు హీరోగా కూడా న్యాయం చేసాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కథను పేపర్ మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. రెండువ భాగంలో అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటకీి కథకు అవసరం లేని సీన్స్ తో కథనం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలలో కథలో సహజత్వం లోపించినట్టు ఉంటుంది.

తీర్పు:

ఛలో లాంటి మంచి విజయంతో మొదలైన ఐరా క్రియేషన్స్ ఆ విజయ పరంపరను కొనసాగించిలేకపోయింది. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్, కశ్మీర పరదేశి హీరోయిన్లుగా రూపొందిన ‘@నర్తనశాల’ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చినప్పటికి నెమ్మదిగా సాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు లేకపోవడం, ఉన్న ఎమోషన్ కూడా ఫేక్ ఎమోషన్ లా అనిపించడం.. ఓవరాల్ గా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. కానీ సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలు బి.సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు. మొత్తం మీద మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సంతృప్తికరంగా లేదనే చెప్పాలి.

web2look Rating: 2/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*