గూఢచారికి నారా లోకేష్ మరియు సూపర్ స్టార్ ల కాంప్లిమెంట్స్..!

గూఢచారికి నారా లోకేష్ మరియు సూపర్ స్టార్ ల కాంప్లిమెంట్స్..! అడివి శేష్ నటించిన గుఢచారి ఇంటా బయటా చక్కని వసూళ్లతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ కు యువహీరో శేష్ పర్ ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడని క్రిటిక్స్ నుంచి ప్రశంసలొచ్చాయి. ఈ సినిమా విజయం శేష్ కెరీర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ఓవైపు ఇండస్ట్రీ ప్రముఖులు మరోవైపు రాజకీయనాయకులు ఈ సినిమాని వీక్షించి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా చూసి ప్రశంసించారు.

ఈ చిత్రంలో తన నటన నచ్చిందని మహేష్ అన్నారని నదియా ఖురేషి పాత్రధారి సుప్రియ ఇదివరకూ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. స్పైడర్ ఫ్లాప్ ని ఇంకా మర్చిపోలేని మహేష్ ఇలా గూఢచారి టీమ్ ని అభినందించడం ప్రముఖంగా చర్చకొచ్చింది. తాజాగా గూఢచారికి ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ మినిస్టర్ నారా లోకేష్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫాస్ట్ ఫేస్ డ్ స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రాన్ని థియేటర్ లో ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాను. అడివి శేష్ – శోభిత ధూళిపాల – ప్రకాష్ రాజ్ ల నటన అద్భుతంగా ఉంది. శశికిరణ్ & టీమ్ వర్క్ బావుంది అంటూ ప్రశంసించారు.

గూఢచారి ఇరు తెలుగు రాష్ట్రాల్లో చక్కని ఓపెనింగులు సాధించిందని ట్రేడ్ లో ముచ్చట సాగుతోంది. రాజకీయ నాయకులు సినిమాలు చూడడమే అరుదు. కానీ అంత బిజీలోనూ శేష్ సినిమాని నారా లోకేష్ థియేటర్ లో వీక్షించి ప్రశంసించడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక బాలయ్యబాబు సినిమాలతో పాటు ఇలా యువహీరోల సినిమాల్ని వీక్షించి నారా బృందం ప్రశంసిస్తే అది పచ్చకండువాల్లో ప్రచారానికి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. రంగస్థలం,  భరత్ అనే నేను తర్వాత శేష్ సినిమాకి ఆ స్థాయిలో ప్రశంసలు దక్కడం విశేషం. మౌత్ టాక్ బావుండడంతో ఈ సినిమాకి మల్టీప్టెక్స్ స్క్రీన్లలో అదనంగా షోలు పెంచుతున్నారు. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*