అదితి కి ఒకే చెప్పిన నాని

సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మంచి నటి అదితి రావ్ హైదరీ. కానీ ఆ తరువాత సరైనపాత్ర పడలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఆ బాధ్యతను తనపై వేసుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి అని వినిపిస్తోంది. నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఆయన చేస్తున్న సినిమాకు మళ్లీ అదితిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలి. నాని సరసన అదితి రావ్ ను తీసుకుని, సుధీర్ బాబు సరసన నివేదా థామస్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంద్రగంటి టెంటటివ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడ ఆ మేరకు ఓకె అన్నట్లు బోగట్టా.


ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. నాని పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్ కూడా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు నాని తన వీలు చూసుకుని డేట్ లు కేటాయించాల్సి వుంది. ప్రస్తుతం జెర్సీ సినిమాతో అలాగే నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని బిజీగా వున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*