తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్:ఎన్టీఆర్‌ బయోపిక్‌

తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్ లు. తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు. అయితే, గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, అప్పటికే కల్యాణ్‌రామ్‌ తన తండ్రి పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌తో ఎన్టీఆర్‌లో హరికృష్ణ ఎవరన్న దానికి సమాధానం లభించేసింది.

 

‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో బాలగోపాలుడు సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు బాబాయ్ వాళ్ల నాన్న గారిలా.. నేను మా నాన్నగారిలా..’ అంటూ ప్రచార రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు. నటుడిగా తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి వెండితెరను పంచుకోవడమే కాదు, ఎన్నికల ప్రచార రథ సారథిగా హరికృష్ణ తండ్రి వెన్నంటే ఉండి ఎన్నో వేల కి.మీ. ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రను ఎవరు చేస్తారా? అన్నదానిపై చర్చ జరిగింది. ఫస్ట్ ఎన్టీఆర్‌ పేరు వినిపించినా, ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌ పేరు బయటకు వచ్చింది. అయితే, ఎక్కడా దీనిపై స్పష్టత లేదు. అయితే, గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, అప్పటికే కల్యాణ్‌రామ్‌ తన తండ్రి పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లున్నా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌తో హరికృష్ణ ఎవరన్న దానికి జవాబు తెలిసింది.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణిగా విద్యాబాలన్‌, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’ను బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథానాయకుడు, జనవరి 24మహానాయకుడుగా విడుదల చేయనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*