రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణానికి గురైనయిన నందమూరి హరికృష్ణ…..!

రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణానికి గురైనయిన నందమూరి హరికృష్ణ…..! నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం జరగ్గా తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఛాతికి స్టీరింగ్ బలంగా ఢీకొనడంతోపాటు.. తలకు తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావమైంది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు. ఉదయం 7.30 గంటలకు ఆయన మరణించారని డాక్టర్లు ప్రకటించారు. 

నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 

ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించే క్రమంలో హరికృష్ణ ప్రయాణిస్తోన్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. వేగం నియంత్రణలోకి రాకపోవడంతో రోడ్డు అవతల వైపు ఎగిరి పడింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుంచి బయట పడిపోవడంతో డ్రైవింగ్ చేస్తోన్న హరికృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే ఆయన కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతోపాటు ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన నార్కెట్ పల్లి బయల్దేరి వెళ్లారు. ఈ వార్త తెలియగానే చంద్రబాబు, నారా లోకేష్ కూడా అమరావతి నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*