సూరి హత్యకేసులో కీలక మలుపు…!


సూరి హత్య కేసులోకీలక మలుపు…!ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి ప్రధాన హత్య కేసులో నాంపల్లి కోర్టుతుది తీర్పుని జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుభానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రెండో నిందితుడు మన్మోహన్‌ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నలుగురునిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. సూరి హత్య కేసులో గతఆరున్నరేళ్ళుగా భానుకిరణ్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, మన్మోహన్‌కూడా జైలులో ఎనిమిదేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. భానుకిరణ్‌కు యావజ్జీవం, మన్మోహన్‌కుఐదేళ్లు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీధర్‌, వెంకటరమణ, సుబ్బయ్య, హరిలనునిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు విచారణలో సీఐడీ పోలీసులు 93 మందిసాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.  ఈ సాక్షాల ఆధారంగా తీర్పుని వెల్లడించారు.

తెలుగుదేశం మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హైదరాబాద్‌లోని నవోదయ కాలనీలో హత్యకు గురయ్యారు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్‌ తుపాకీతో కాల్చి పరారయ్యాడని మధుమోహన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును మొదట బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్‌ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు శిక్షను ఖరారుచేసింది. కోర్టు తీర్పుపై సూరి సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారట.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*