ఐ మిస్ యు అన్న అంటున్న నాగార్జున.. చివరి సారిగా మాట్లాడిన హరికృష్ణ….!

ఐ మిస్ యు అన్న అంటున్న నాగార్జున.. చివరి సారిగా మాట్లాడిన హరికృష్ణ….! తెలుగు సినిమా పరిశ్రమకు హరికృష్ణ మృతి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా తనదైన ముద్రను వేసిన హరికృష్ణకు నాగార్జునతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి సినిమాల్లో నటించారు. పలు సందర్బాల్లో వీరిద్దరు కలవడం – తరచుగా మాట్లాడుకోవడం కూడా చేసేవారు. తాజాగా హరికృష్ణ మృతితో నాగార్జున తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అదే సమయంలో హరికృష్ణ తనతో చివరిసారి మాట్లాడిన మాటలను నాగార్జున గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగంకు గురయ్యారు.

నాగార్జున ట్విట్టర్ లో ఈ విషయమై స్పందిస్తూ… చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి – కలవాలి తమ్ముడు అంటూ చివరిసారిగా కొన్ని వారాల క్రితం ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఇంతలోనే ఇలా జరిగింది. ఐ మిస్ యు అన్న అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. హరికృష్ణ మరణం నాగార్జునను తీవ్రంగా కలచి వేసింది. నేడు ఆయన పుట్టిన రోజు – హరికృష్ణ మరణంతో పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునతో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణతో తమకు ఉన్న సాన్నిహిత్యంను గుర్తు చేసుకుంటున్నారు.

తన బర్త్ డే రోజే ఆప్తుని కోల్పోయినందుకు నాగార్జున కుమిలి పోతున్నట్లుగా అక్కినేని కుటుంబ సన్నిహితులు అంటున్నారు. నాగార్జున ట్విట్టర్ లో హరికృష్ణతో కలిసి నటించిన సీత రామరాజు చిత్రంకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేయడం జరిగింది. 1999లో విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఇద్దరి కాంబినేషన్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు ప్లానింగ్ అయ్యాయి కాని కార్యరూపం దాల్చలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*