నాదెండ్ల మనోహర్ జనసేనలోకా.. నిజమేనా…?

నాదెండ్ల మనోహర్ జనసేనలోకా.. నిజమేనా…?కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గుడ్ బై చెప్పారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి మనోహర్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్ గురువారం సాయంత్రం తిరుపతికి బయల్దేరి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తిరుపతిలో జనసేన అధినేత పవన్‌తో సమావేశం అవ్వబోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో ఆరేడు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టు సమాచారం. జనసేనలో చేరికపై శుక్రవారం అధికారికంగా ప్రకటనచేయబోతున్నట్లు తెలుస్తుంది. 

 

2009 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్ రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011లో స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నిక కాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో కూడా పనిచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*