నా సండే మీల్స్‌ ఫొటోను మీకు పంపిస్తా…సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎప్పుడూ మంచి పనులతోనే వార్తల్లో నిలిచే సమంత.. ఇప్పుడు చేసిన పనితో అభిమానులు హర్టయ్యారు. ఆమె ఇటీవలే ‘కుర్ కురే’ చిప్స్ బ్రాండుకి ప్రచారకర్తగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే కుర్ కురే పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదనే ఆరోపణలున్నాయి. దీని గురించి అనేక నెగెటివ్ వార్తలు వచ్చాయి.

అలాంటి బ్రాండుని ఎలా ప్రమోట్ చేస్తావంటూ సమంతను విమర్శిస్తున్నారు నెటిజన్లు. నువ్వు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. జనాలను మాత్రం హాని కల్గించే స్నాక్స్‌ను తినమని ప్రచారం చేస్తున్నావా అంటూ ఓ నెటిజన్ సమంతను ప్రశ్నించాడు. ఐతే ఈ కామెంట్ చూసిన సమంత.. స్పందదించింది.

“కావాలంటే నా సండే మీల్స్‌ ఫొటోను మీకు పంపిస్తా. అవును.. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. అదే విధంగా చీట్‌ మీల్‌ డేస్‌లో ఓ సాధారణ వ్యక్తిలా ఇలాంటి స్నాక్‌ తీసుకోవడం నాకు ఇష్టం. ఈ బ్రాండ్‌ మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. నాకు కూడా అలాంటి సమాధానాలు చెప్పాకే దీన్ని ప్రమోట్ చేయడానికి అంగీకరించా” అని సమంత ట్వీట్ చేసింది.

ఐతే సమంత ఈ సమాధానం ఇచ్చాక కూడా చాలామంది నెటిజన్లు ఆమెను విమర్శించడం ఆపలేదు. సెలబ్రెటీలకు ఏవో కబుర్లు చెప్పి.. వాళ్లతోనూ అవే మాటలు చెప్పించి ఇలాంటి బ్రాండ్లు తమ ఉత్పత్తుల్ని సేల్ చేసుకుంటాయని.. మ్యాగీ సహా ఎన్నో బ్రాండ్ల విషయంలో ఇలాంటివి చూశామని.. జనాల ఆరోగ్యం అంటే వీళ్లకు లెక్క ఉండదని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*