ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు పెళ్ళి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వల్సిందే…!

ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు పెళ్ళి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వల్సిందే…!ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కూతురు ఈశా అంబానీ పెళ్లికి అంతా సిద్ధమైతుంది. ముంబయిలోని ముకేశ్‌ నివాసమయిన యాంటీలియాలో నేడు ఈశా వివాహం ఆనంద్‌ పిరమాల్‌తో జరగనుంది. సోమవారంతో ఈశా ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఉదయ్‌పూర్‌లో జరిగాయి. అయితే వివాహ ఆహ్వాన పత్రిక నుంచి ప్రతీది అంబానీ కుటుంబ స్థాయికి తగ్గట్లే విలాస వంతంగా ఉండేలా చూసుకున్నారు. ఇక ఇప్పుడీ వివాహానికి సంబంధించి మరో విషయం కూడా చక్కర్లు కొడుతోంది. ఈశా వివాహానికి 100మిలియన్‌ డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.718 కోట్లు)ఖర్చు చేస్తున్నారట. అయితే ఇందులో నిజం లేకపోలేదని ముకేశ్‌ అంబానీకి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ల స్థాయికి తగ్గట్టుగానే ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంబానీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.  

 

 

 

ఈ బుధవారం జరగబోయే ఈశా వివాహానికి యాంటీలియాను సర్వాంగ సుందరంగా అలంకరించారు. 27 అంతస్తుల ఈ భవనం కాంతులు వెదజల్లుతోఁది. అయితే వివాహానికి వచ్చే అతిథులు ఇక్కడికి రావడానికి ప్రత్యేక భద్రత చర్యలను తీసుకుంటున్నారు. పెళ్లికి వచ్చే అతిథులను ఫోన్లు తీసుకురావద్దని, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయద్దని వివాహ ఆహ్వాన పత్రికతో పాటే సమాచారం అందించారట. అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అతిథులు హాజరు కానుండటంతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. 37 ఏళ్ల క్రితం యువరాజు చార్లెస్‌, డయానాల వివాహానికి 110మిలియన్‌ డాలర్లు వెచ్చించారు. అయితే ఈశా పెళ్లి ఖర్చుపై వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న వారిలో వీరిది రెండో జంటగా నిలుస్తుంది.  

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*