ఉత్తమ్, సుహాసినీలపై విమర్శలు గుప్పించిన కవిత…!

ఉత్తమ్ మరియు సుహాసినీలపై విమర్శలు గుప్పించిన కవిత…! కాంగ్రెస్‌ పార్టీపై నిజామాబాద్‌ ఎంపీ కవిత మరోసారి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన భార్యకు టికెట్‌ ఎలా ఇప్పించుకున్నారని నిలదీశారు. హైదరాబాద్‌లో కవిత మీడియాతో చిట్‌చాట్‌గా సంభాషించారు. ఉత్తమ్‌కు నైతికత ఉంటే టికెట్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పాలన టీఆర్ఎస్ ది కాదని కాంగ్రెస్‌దేనని కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు కుటుంబసభ్యులకే సీట్లు పంచుకున్నారని ఆరోపించారు. బీసీలకు సీట్ల విషయంపై కాంగ్రెస్‌ వాళ్లే విమర్శించుకుంటున్న సంగతిని కవిత గుర్తుచేశారు.  

 

 

కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినా ప్రభావం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో తెదేపానే తిరస్కరించినప్పుడు అభ్యర్థి ఎవరు ఉన్నా లాభమేంటని ప్రశ్నించారు. సెటిలర్లు టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోనే పనిచేయించుకుంటామని అంటున్నారని కవిత పేర్కొన్నారు. అటు మైనారిటీల నుంచి తమకు మంచి స్పందన వస్తుందన్న కవిత MIMతో సఖ్యత కొనసాగుతుందన్నారు.

 

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*