జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే జగన్‌కు అయ్యింది చిన్న గాయ‌మే అని.. దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నార‌ని జేసీ అన్నారు. చిన్న కోడిక‌త్తితో గాయ‌మైతే జ‌గ‌న్ డ్రామాలు ఆడుతున్నార‌ని జేసీ మండి ప‌డ్డారు. జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి అవ్వాల‌నే ఆశ త‌ప్పా, కామ‌న్ సెన్స్ లేద‌ని.. అత‌ని మాన‌సిక స్థితి ప‌ట్టిసీమ‌వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడే త‌న‌కు అర్ధ‌మైంద‌ని జేసీ అన్నారు. జ‌గ‌న్‌కు రెడ్లెవ‌రు ఓట్లు వేయొద్ద‌ని జేసీ పిలుపునిచ్చారు. జ‌గ‌న్ ఏపీకి శ‌నిలా ప‌ట్టుకున్నాడ‌ని జేసీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌ మ‌రోసారి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితేనే అనంతపురంకు నీళ్లు వ‌స్తాయ‌ని జేసీ బ్ర‌ద‌ర్ అన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాదాపు 30 శాతం మంది అభ్య‌ర్ధుల‌ను మార్చ‌క‌పోతే టీడీపీ ఓడిపోతుంద‌ని జేసీ అన్నారు. మ‌రి జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*