తమన్నా సందీప్ కిషన్ “నెక్స్ట్ ఏంటి”…!

తమన్నా.. “నెక్స్ట్ ఏంటి” మరీ…! ‘హమ్ తుమ్’, ‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  తమన్నా, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా ఎందుకో షూటింగ్ ప్రోగ్రెస్ గురించి పెద్దగా ఏమి బయటకు రాలేదు.  కానీ తాజాగా సినిమాకు సంబంధించిన కబుర్లు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు “నెక్స్ట్ ఏంటి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. అంతే కాదు ఈ సినిమానుండి రెండు స్టిల్స్ కూడా విడుదల చేశారు. ఒక స్టిల్ లో తమన్నా, సందీప్ కిషన్ తో ఉత్సాహంగా లండన్ వీధుల్లో స్టెప్పులు వేస్తుండగా మరో స్టిల్ లో తమన్నా, నవదీప్ కలిసి ఉన్నారు.

 

 

ఇక ఈ సినిమాలో  పూనం కౌర్, లారిస్సాలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ సినిమాకు అక్షయ్ పూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా మెజారిటీ భాగాన్ని లండన్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.  డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  డిసెంబర్ లో ఇప్పటికే సినిమాలు ప్యాక్డ్ గా ఉన్నాయి. మరి ఈ “నెక్స్ట్ ఏంటి” కి స్లాట్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి మరీ…!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*