12 సెకండ్స్ లో మంటలు ఆర్పేసినా మహిళా

జియాంగ్జిలోని ఓ పెట్రోల్‌ బంకులోకి ఓ వ్యక్తి బండిపై ఉండగానే అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు బైక్‌పై నుంచి అమాంతం దూకి పక్కకు వచ్చేశాడు. పక్కన ఉన్న మిగతా వారు కూడా వాళ్ల తమ వాహనాలను తీసుకుని దూరంగా జరిగారు. మంటలను గమనించిన వెంటనే ఇంధనం నింపుతున్న మహిళ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా, ధైర్యంగా అగ్నిమాపక పరికరం తెరిచి క్షణాల వ్యవధిలోనే మంటలు ఆర్పేసింది. మరో మహిళా సిబ్బంది ఇంకో అగ్నిమాపక పరికరం తీసుకొని హుటాహుటీన వచ్చారు. కానీ, అప్పటికే మంటలు ఆరిపోయాయి. మహిళ సమయస్ఫూర్తితో వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్‌ డైలీ ఈ వీడియోను జులై 12న పోస్ట్‌ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*