ర్యాంప్ వాక్ పై మాతృత్వాన్ని చూపుతున్న మోడల్ మామ్

ర్యాంప్ వాక్ పై మాతృత్వాన్ని చూపుతున్న మోడల్ మారా మార్టిన్. ఈ సృష్టిలో తల్లికి మాత్రమే ఉన్న గొప్ప అదృష్టం బిడ్డలకు పాలివ్వడం. కానీ ఇప్పటికీ తల్లులు బహిరంగంగా  అందరిముందు పాలివ్వడానికి ఇష్టపడరు. ఇప్పుడు కొంతమంది  అయితే అందచందాలు పోతాయని  తమ ఫిజిక్ పాడవుతుందని అందుకు ముందుకు రారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం అని ఎంతమంది చెప్పినా, తెలిసినా కూడా కొంతమంది తల్లులు డబ్బా పాలతోనే పిల్లలను పెంచుతుంటారు. ఇలాంటి ఎన్నో అపోహలు సమాజంలో గూడుకట్టుకొని ఉన్నాయి. వాటన్నింటిని తొలగించేందుకు ఓ మహిళా మోడల్ ముందుకొచ్చింది.

 కానీ, ఈ మోడల్ ఇదంతా సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటింది. స్పోర్ట్స్  ఇల్లస్ట్రేటెడ్  స్విమ్ సూట్   మోడల్ మారా మార్టిన్ ఈ మేరకు చేసిన పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మోడలింగ్ రంగంలో కూడా చాలా మంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడానికి సందేహిస్తారు.  అమెరికాలోని మియామీలో నిర్వహించిన స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మార్టిన్ బికినీ ధరించి తన ఐదు నెలల పాపకు పాలిస్తూ ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోడల్ మామ్  హ్యాష్ ట్యాగ్ తో సంచలనమవుతున్నాయి. ఇక నుంచి ఈ మోడల్ ని చూసైనా మహిళలు మారాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*