జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్:గంటా శ్రీనివాస్

జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్ గా మిగిలిపోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సిపీ మునుగుతున్న పడవని 2019లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి గంటా జోస్యం చెప్పారు. జగన్ ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు అఫిడివిట్లో 14 పేజీల‌ కేసుల గురించి పెట్టారని, దేశంలో ఏ నేతపై కూడా ఇన్నికేసులు ఉండవ‌ని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నికార్సైన వ్యక్తి చంద్ర‌బాబేన‌ని, చంద్రబాబు గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంద‌ని మంత్రి గంటా విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేసారంటూ అనేక విచారణలు జరిపించిన వైఎస్‌ ఒక్కటీ నిరూపించలేకపోయారని, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని అన్నారు.

 

నవ్యాంధ్ర రాష్ట్రంలో అనేక ప్ర‌భుత్వ పథ‌కాలను అడ్డుకోవాలని వైసిపి ప్రయత్నించిందని మంత్రి గంటా విమర్శించారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన యువ నేస్తం పథకం కూడా అడ్డుకోవాలని యువతని వైసిపీ రెచ్చ‌గొట్టిందని ఆరోపించారు. వైసిపి నేతలు కుట్రపూరితంగా రాజధానికి నిధులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కి రైతుల పేరుతో తప్పుడు మెయిల్స్ పెట్టారన్నారు. అభివృద్దిని అడ్డుకునేందుకు జగన్ సైకోలా ప్రవర్తించారన్నారు. అమరావతి శంకుస్థాపన కోసం ఆహ్వానం ఇస్తామన్న మంత్రులను జగన్ రావద్దని చెప్పారని మంత్రి గంటా గుర్తుచేశారు. బిజేపి రాష్ట్రాన్ని ఆదుకుంటుందని ఆ పార్టీతో కలిసామని కాని మోసం చేశారని చెప్పుకొచ్చారు.

ధ‌ర్మ‌ పోరాటం చేస్తున్న చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు. 
ప్రతిపక్షనేత జగన్ 3వేల కిలోమీటర్లు కాదు 30 వేల కిలో మీటర్లు నడిచినా ఉపయోగం లేదన్నారు. విశాఖలో జరిగిన పాదయాత్రలో కేంద్రాన్ని రైల్వే జోన్ కోసం జగన్ మాటవరసకైనా అడగలేదన్నారు. వైసిపీ ఎంపీల‌ రాజీనామా అంతా బూటకమని తేలిపోయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.   చంద్రబాబు గారిని విమర్శించే అర్హత జగన్ కి లేదని తేల్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*