పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏపీలో పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు సోమవారం(డిసెంబరు 3) పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 29 వరకు పదో తరగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 7 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి  గంటా సూచించారు. 

 

ఏపీలో 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*