విమానం మంటల్లో కాలిపోయినా కూడా మొత్తం ప్రయాణికులు సేఫ్…ఎలానో తెలుసా…..!

విమానం మంటల్లో కాలిపోయినా కూడా మొత్తం ప్రయాణీకులు సేఫ్ ఎందుకో తెలుసా..! అదృష్టం మన వెంటే ఉంటే చావు మనల్ని దరిచేరదని మరోసారి నిరూపించింది. ఘోర విమాన ప్రమాదం జరిగి విమానం మంటల్లో కాలిపోయినా సరే అందులో ప్రయాణించిన మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మెక్సికో దేశంలో జరిగింది. ఏరో మెక్సికోకు చెందిన విమానం మంగళవారం 97మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో దురంగో నుంచి మెక్సికోకు వెళ్లడానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.

అందువలన దీంతో విమానాన్ని అత్యవసరంగా దించుతుండగా ఒక్కసారిగా రన్ వేకు కొద్ది దూరంగా పొలాల్లో కూలిపోయింది. విమానం క్రాష్ ల్యాండ్ అవ్వగానే అందులో మంటలు మొదలయ్యాయి. కానీ ఆ సమయంలోనే భారీ వడగండ్ల వాన కురవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో మేలుకున్న ప్రయాణికులు ఎమర్జీన్సీ ఎక్సిట్ డోర్ల గుండా దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. విమానం మంటల్లో చిక్కుకున్నప్పటికీ అందులోని 101 మంది ప్రాణాలతో బయటపడడం విశేషంగా చెప్పవచ్చు.

ఇందులో 85మందికి  గాయలయ్యాయని మెక్సికో రవాణా శాఖ మంత్రి గెరార్డో రూయిజ్ తెలిపారు. గాయపడిన వారిలో 49మందిని ఆస్పత్రిలో చేర్పించామని మిగతా వారికి చిన్న గాయాలు కావడంతో ఇంటికి పంపించివేశామని తెలిపారు. భారీ వర్షం వల్లే మంటలు వేగంగా వ్యాపించకుండా అడ్డుకట్టపడింది. ఈ గ్యాప్ లోనే ప్రయాణికులు సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానం నుంచి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత విమానం మంటల్లో కాలిపోయింది. ఇదొక అద్భుతమనే చెప్పాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*