రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్……!

రకుల్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న మహేష్. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ బాబు జోరుమీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో గడ్డం పెంచి డిఫెరెంట్ న్యూలుక్ లో దర్శనమివ్వనున్నాడు. మహేష్ బాబుకు ఇది 25వ సినిమా దిల్ రాజు-అశ్వినీదత్-పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో భారీ షెడ్యూల్ కోసం ఫారన్ వెళ్లేందుకు సిధ్ధమవుతోందట.

సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమా చేస్తుండగానే ఇంకో సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు. తన తరువాత చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో తీస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రంగస్థలం సక్సెస్ తో తెలుగు నేటివిటీ సినిమాలకు కొత్త భాష్యం చెప్పిన సుకుమార్ మహేష్ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశారట. మహేష్ 25వ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

రాబోయే సుకుమార్ మహేష్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రకుల్ ప్రీతి సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు నడుస్తున్నాయి. స్పైడర్ సినిమా లో మహేష్ తో కలిసి నటించిన రకుల్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహపడింది. ఆ సమయంలోనే మహేష్ బాబు మరో సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడంట. ఆ ఇచ్చిన మాట ప్రకారం సుకుమార్ సినిమాలో చాన్స్ ఇప్పించాడనే ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది. సినిమా మొదలైతే కానీ పూర్తి తారాగణం ఎవరనేది తెలిసేటట్లులేదు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*