‘మా’ ఎల‌క్ష‌న్స్ : న‌రేష్ విజయం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్ (మా) ఎల‌క్ష‌న్స్ హోరా హోరీగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం జ‌రిగిన ఈ మా అధ్యో ఎన్నిక‌ల్లో శివాజీ రాజా పై సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ విజ‌యం సాధించారు.

అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ పై రాజ‌శేఖ‌ర్ గెల‌వ‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణా రెడ్డి, న‌టి హేమ విజ‌యం సాధించారు.

ఇక జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌ట‌రిగా ర‌ఘుబాబు పై జీవిత రాజ‌శేఖ‌ర్, అలాగే జాయింట్ సెక్ర‌ట‌రీగా గౌత‌మ్ రాజు, శివ‌బాలాజీ విజ‌యం సాధించ‌గా.. ట్రెజ‌ర‌రీగా కోట శంక‌ర్రావు పై రాజీవ్ క‌న‌కాల విజ‌య‌భేరి మోగించారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఈ తాజా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్ ఎల‌క్ష‌న్స్ రిజ‌ల్ట్స్ పై సినీ వర్గాల్లో పెద్ద చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి. మా అసోసియేష‌న్‌లో నిధుల దుర్వినియోగం జ‌రిగిందంటూ గ్రూప్ త‌గాదాలు తెర‌పైకి రావ‌డంతో ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌ల‌కే తెర‌లేపింది.

ఈ క్ర‌మంలో శివాజీ రాజా వ‌ర్గానికి, నరేష్ వ‌ర్గానికి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌డమే కాకుండా ఈ వ్య‌వ‌హారం అంతా మీడియాకి ఎక్కింది. దీంతో మా ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌ధానంగా శివాజీ రాజ‌- న‌రేష్‌ల మ‌ధ్య పోటీ రంజుగా మారింది. ఇక మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మ‌ద్ద‌తు శివాజీ రాజా ప్యాన‌ల్‌కు ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో ఎన్నిక‌ల రెండు మూడు రోజుల ముందు వ‌ర‌కు శివాజీ రాజా ప్యాన‌ల్‌దే విజ‌య‌మ‌ని స‌ర్వ‌త్రా భావించారు. అయితే ఈ క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్, జీవిత‌లు చిరంజీవిని క‌ల‌వ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ త‌ర్వాత‌ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మీడియా ముందుకు వ‌చ్చి త‌న మ‌ద్ద‌తు న‌రేష్‌కే అని మీడియా ముఖంగా చెప్ప‌డంతో, ఆ ప్ర‌భావం తాజా మా ఎన్నిక‌ల పై క‌నిపించింది.

నాగుబాబుకు టీవీ ఆర్టిస్ట్‌లో ఫాలోయింగ్ విప‌రీతంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎక్కువ మంది టీవీ ఆర్టిస్టులు సినిమాల్లో కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఓటింగ్ టైమ్‌లో నాగ‌బాబు చ‌క్రం బాగా ప‌నిచేసింద‌ని, దీంతో అది కూడా శివాజీ రాజా టీమ్‌కు ప్ర‌తికూలంగా మారింద‌ని తెలుస్తోంది.

ఇక అంతకంటే ముఖ్యంగా శివాజీరాజా ప్యానెల్ ఆద్వ‌ర్యంలో విదేశాల్లో జ‌రిగిన ఈవెంట్ల విష‌యంలో అవ‌క‌త‌వ‌కు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో జ‌రిగిన కొన్ని అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు పరిష్క‌రించ‌డంలోనూ శివాజీరాజా ప్యానల్ విఫ‌ల‌మ‌వ‌డంతో క్ర‌మ‌క్ర‌మంలో ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు కోల్పోవాల్సి వ‌చ్చిందని టాక్ వినిపిస్తోంది.

అదే టైమ్‌లో న‌రేష్ ప్యాన‌ల్‌కు మ‌హేష్‌బాబు కుంటుంబం మ‌ద్ద‌తుతో పాటు మెగా కుంటుంబం నుండి నాగ‌బాబు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు తెల్ప‌డంతో న‌రేష్ టీమ్‌కు ఇత‌ర పెద్ద కుటుంబాల మ‌ద్ద‌తు పెరిగిపోయింద‌నే టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ఈ ప్ర‌భావం మిగ‌తా వారి పై ప‌డ‌డంతో ఓట‌ర్లు అంతా న‌రేష్ ప్యాన‌ల్ వైపు ట‌ర్న్ అయ్యార‌ని, ఇవే న‌రేష్ గెలుపుకు, శివాజీ రాజా ఓట‌మికి ముఖ్య కార‌ణాలని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*