‘లవర్’ తెలుగు మూవీ రివ్యూ మరియు రేటింగ్

విడుదల తేది : 20 జూలై 2018

హీరో, హీరోయిన్ : రాజ్ తరుణ్, రిద్ది కుమార్

దర్శకుడు : అనిష్ కృష్ణ

మ్యూజిక్ డైరెక్టర్ : అంకిత్ తివారి

నిర్మాత : హర్శిత్ రెడ్డి

నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్

నటి నటులు : అజయ్, రాజీవ్ కనకాల, సుబ్బారావు

విశ్లేషణ :

రాజ్ తరుణ్, రుద్ది కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘లవర్’ ఈ రోజు ప్రపంచ వ్యప్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అనిష్ కృష్ణ దర్శకుడిగా పనిచేసారు. ఇక గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కి దిల్ రాజ్ లక్కీ విజయన్ని అందిస్తుందేమో వేచిచూడాలి. ఈ సినిమాతోనైన యువ హీరో రాజ్ తరుణ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇటివలే ఈ చిత్రబృండం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టిజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. ట్రైలర్ ని బట్టి ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

కథ :

ఇక ఈ సినిమా కథ విషయనికస్తే  హీరో రాజ్(రాజ్ తరుణ్) ఈ సినిమాలో ఒక మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. సినిమా కొద్ది సేపటికే హీరో ఒక ఫైట్ లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు. అక్కడే పని చేస్తున్న చరిత(రిద్ది కుమార్)ని మొదటిసారి చూస్తాడు. చరిత ఆ ప్రభుత్వ అసుపత్రిలో నర్స్ లా పనిచేస్స్తుంది.  తొలి చూపులోనే రాజ్ హీరోయిన్ తో ప్రేమలో పడిపోతాడు, వెంటనే ‘నాలో ఎదో చిలిపి కల’ అనే ఒక చక్కటి మెలోడి పాట వస్తుంది.

ఇక మెల్లగా అన్ని సినిమాల్లోలాగానే  చరితని ఇంప్రెస్ చేయడానికి ప్రేమలో పడేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇది ఇలా ఉండగా అనుకోకుండా చరితని విల్లన్స్ కిడ్నాప్ చేస్తారు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో  కథ రొటీన్ గా ఉన్నా చక్కటి లవ్ సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టికోవచు.

ఇక సెకండ్ హాఫ్ లో హీరో రాజ్ హీరోయిన్ కోసం వెతుక్కుంటూ కేరళకి వెళ్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం కేరళలోనే చిత్రీకరించారు దర్శకులు. ఎన్నో చక్కటి దృశ్యాలు ప్రేక్షకులకు దర్శనమిస్తాయి. ఇక రాజ్ చరితని కలిసిన వెంటనే ‘అద్బుతం’ అనే ఒక చక్కటి పాట వస్తుంది. ఈ సినిమా లో ఈ పాటే హైలైట్, కేరళలోని అద్బుతమైన ప్రకృతిని సినిమాటోగ్రాఫేర్ సమీర్ రెడ్డి మనకు చూపించే ప్రయత్నం చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విలన్ పాత్రని ఎంతో చక్కగా చిత్రికరించారు దర్శకుడు. ఇక సినిమా క్లైమాక్స్ రొటీన్ ట్విస్ట్ తోనే ముగుస్తుంది.

ఎవరెలా :

‘లవర్’ సినిమా  రొటీన్ కథాంశం తో తెరకెక్కించిన మరో తెలుగు ప్రేమకథగా చెప్పవచ్చు. ఇక దిల్ రాజు ప్రమోషన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిన్చవచు. సినిమాలో చరితని ఎలాగైన దక్కించుకోవాలనే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. విలన్ పాత్ర కేరళ బ్యాక్ డ్రాప్ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచు. రాజీవ్ కనకాల నటనతో ప్రేక్షకులని కంటతడి పెట్టించాడు.

 

web2look రేటింగ్ : 2.5/5

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*