టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్

తెలంగాణలో రెండోసారి అధికారాన్నిచేపట్టిన టీఆర్ఎస్ అధినేతకేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకఅధ్యక్షుడిగా తన కుమారుడు, మాజీమంత్రి కేటీఆర్‌ను నియమించారు. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్షపదవి పార్టీలో లేదు. ఈ నియామకంతో టీఆర్ఎస్ లో నూతన అధ్యాయానికి కేసీఆర్‌తెరదీశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలనే ఆలోచనతోనేకేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌అత్యంత కీలకంగా వ్యవహరించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలో విజయవంతమయ్యారు. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూడా పార్టీకి కేటీఆర్‌ ఘన విజయం అందించారు. అలాగే‌ గత ప్రభుత్వంలో తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖలను కూడా ఆయన సమర్థంగా నిర్వహించారు. రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్‌ అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*