తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….!

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….! ఎవరెన్ని చెప్పినా ఒక్క మాట నిజం.. తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం.. దమ్ము ఎవరికీ లేదన్నది నిజం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పోటీ పడే ఏకైక వ్యక్తి కోదండం మాష్టారు సైతం దమ్ముగా మాట్లాడే విషయంలో ఎంతోకొంత  త్రోటుపాటుకు గురి అవుతారు. రాజకీయ నేతలు మాత్రమే కాదు.. చివరకు మీడియా సైతం తొందరపడి మాట అనలేని పరిస్థితి ఉందంటారు.

అదెంతలా అంటే.. కేసీఆర్ ను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే నేతల ప్రెస్ మీట్లు సింగిల్ కాలమ్.. డబుల్ కాలమ్ లకు పరిమితమయ్యే పరిస్థితి.అలాంటి టఫ్ పరిస్థితుల్లో కేసీఆర్ ను సింగిల్ హ్యాండ్ తో విరుచుకుపడాలన్న ప్రయత్నమే గొప్పగా చెప్పాలి. కొమ్ములు తిరిగిన మొనగాళ్లుగా పేరున్న వారికి సైతం హ్యాండిల్ చేయలేని విషయాన్ని కొండా సురేఖ మాత్రం చాలా సింఫుల్ గా తేల్చేయటం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ అంటే సహజంగా ఉండే బెరుకును బద్ధలు కొట్టేసిన ఘనత మాత్రం కొండా సురేఖకే సొంతంగా చెప్పక తప్పదు.

ఇవాల్టి రోజున తెలంగాణలో కేసీఆర్ అండ్ కోను విమర్శించటం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం చెప్పినంత సులువు కాదు. కానీ.. అలాంటి ఇబ్బందుల్ని.. ఒత్తిళ్లు తమను ఏమీ చేయలేవన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కొండా సురేఖ సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

 

 

అన్నింటికి మించి.. పార్టీలో ఉంటూ.. పార్టీ అధినేత కుటుంబంపై ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయటం మామూలు విషయం కాదని చెప్పక తప్పదు. కేసీఆర్ అన్నా ఆయన కుటుంబమన్నా మనకెందుకులే అని ఫీలయ్యే నేతలు కొందరు.. మన స్థాయి కాదులే.. తిట్టి మరీ లేనిపోని తిప్పలు ఎందుకు కొని తెచ్చుకోవటమన్న జాగ్రత్తల్ని ప్రస్తావించే నేతలకు భిన్నంగా తీవ్రస్థాయిలో ఫైర్ కావటం ద్వారా కొండా దంపతులు ఒక సందేశాన్నికేసీఆర్ వైరి వర్గానికి ఇచ్చారని చెబుతున్నారు.

పరుగులు రాబట్టటం అతి కష్టంగా ఉన్న వేళ ఫోర్లు.. సిక్స్ లు కొట్టి తమ దూకుడుతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే పించ్ హిట్టర్ మాదిరి కొండా మారారని చెప్పక తప్పదు. కేసీఆర్ అండ్ కోపై తీవ్ర విమర్శలు చేస్తే లేనిపోని తలనొప్పి అన్న విషయాన్ని పక్కకు పెట్టేసి.. తిట్టేసేయొచ్చన్న నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన ఘనత కొండా సురేఖ సొంతంగా పలువురు అభివర్ణించటం విశేషం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*