ఆంధ్రాలో కూడా కెసిఆర్ అభిమానలు

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్‌కు ఆంధ్రలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉంది. కేసీఆర్ విజయవాడ వెళ్లినప్పుడు.. అక్కడ భారీ స్థాయిలో వెలిసిన కటౌట్లే దీనికి నిదర్శనం. 

తాజాగా ఓ ఆంధ్ర యువకుడు కేసీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. ఏపీకి చెందిన రోహిత్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టాడు. నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి గులాబీ దుస్తుల్లో టీఆర్ఎస్ జెండాతో కాలినడకన హైదరాబాద్ బయల్దేరాడు. కేటీఆర్‌ను విపరీతంగా అభిమానించే రోహిత్ తన గుండెలపై ఆయన రూపాన్ని టాటూగా వేయించుకోవడం విశేషం.ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్ ఒకరు కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ పాదయాత్ర చేపట్టిన రోహిత్‌ అభిమానానికి మంత్రి.ఆయన థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*