మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….!

మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….! ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగానే కాదు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధాని మోడీపై నేషనల్ కాన్పరెన్స్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రధానిని ఉగ్రవాదిగా ఆయన అభివర్ణించటం షాకింగ్ గా మారింది.

వారు మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలుస్తారు. అయితే దేశ ప్రధానే అతి పెద్ద టెర్రరిస్ట్ మానవత్వాన్ని హతమార్చే హంతకుడు అంటూ ఎమ్మెల్యే జావేద్ రాణా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఫూంచ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే 2002లో గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఈ విధమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ఎమ్మెల్యే రాణాకు వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేం కాదు. తరచూ నోటి మాటలతో వార్తల్లోకి వస్తుంటారు. అయితే..ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మోతాదు మించిపోయాయి. కేంద్రం కానీ ఆర్టికల్ 35ఏ.. 370లకు మార్పులు చేస్తే కశ్మీర్ లో భారత జెండా ఎగురదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370ను రద్దు చేయొద్దని తాను ప్రధానిని విన్నవించుకుంటున్నానని జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించటమే బీజేపీ సంఘ పరివారం ఎజెండాగా ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు విచారణలో ఆర్టికల్ 370పై కేంద్ర ప్రభుత్వం వాస్తవాల్ని వక్రీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రధానిని ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*