కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం….!

కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం….! కాంగ్రెస్ సాయంతో కర్ణాటకలో అధికారాన్ని అందుకున్న జేడీఎస్ పార్టీ తన బలాన్ని దేశ వ్యాప్తంగా పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో జతకడుతూ కొత్త తరహా రాజకీయాలకు తెరతీస్తున్నారు. జేడీఎస్ అధినేత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం ఏపి లోని విజయవాడ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏపి సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలుసుకొని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గురించి చర్చలు జరిపారు.

 

 

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన గురించి కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. దేశంలోని 17 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో చంద్రబాబు సఫలమయ్యారు. ఆయన ఒక విజన్ కలిగిన నాయకుడు. రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఆయన అద్భుతమైన పాలనతో అభివృద్దివైపుకు తీసుకువెలుతున్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై చంద్రబాబుతో చర్చలు జరిపాను. ఇలాంటి ఎన్డీయే రాజకీయ వ్యవస్థకు చంద్రబాబు నాయకత్వంలో వ్యతిరేఖంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం” అని కుమారస్వామి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*