ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నా కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఉమా మహేశ్వర నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ MLA అభ్యర్థిగా మాదినేని ఉమా మహేశ్వర నాయుడు గారిని ఎంపిక చేశారు. టీడీపీ పార్టీ MLA అభ్యర్థి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు . వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా మా కోసం పని చేసే నాయకుడు కావాలి అని ఎదురు చూస్తున్నారు.సీమజిల్లాలు ఒకప్పుడు వలసలకు,కరువుకు పెట్టింది పేరు,ఇప్పుడు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయి. చంద్రన్న పాలనలో సీమజిల్లాలు సాధించిన విజయాలే అందుకు తార్కాణం అంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మీలో ఒక్కడిలా పని చేస్తాను అని ఉమా మహేశ్వర నాయుడు చెప్పారు . కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబం మాత్రమే రోడ్డున పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అనాధల్ల మారుతుంది. చంద్రబాబు తప్ప ఎవరు వచ్చినా ఒక ఇటుక కూడా వేయలేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పారు ఉమా మహేశ్వర నాయుడు గారు.

కళ్యాణదుర్గం ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటూ మాకు మీరే కావాలి అంటూ జై ఉమన్న…. జై జై చంద్రబాబు అంటూ ప్రజలు ఆనందంతో ఉరుకలు వేస్తున్నారు.ఈ సారి కళ్యాణదుర్గం లో టీడీపీ దే విజయం సాధించాలి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*