స్టార్ హీరోకి నో…..చెప్పిన అందాల భామ…!

హీరోల్ని ఎంచుకునే పద్ధతి లో చందమామ కాజల్ చాలా జాగ్రత్తగా అనుసరిస్తోంది. ఇటీవల మరీ సెలక్టివ్ గా ఎంపికలు ఉంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఇలయదళపతి విజయ్ రేంజ్ హీరోలకు ఓకే చెబుతోంది. లేదంటే `అ!` తరహాలో ప్రయోగాత్మక సినిమాల్లో అతిధి పాత్రలైనా సరిపెట్టుకుంటోంది. అంతేకానీ మీడియం రేంజ్.. మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం ఓకే చెప్పడం లేదు. అదంతా అటుంచితే కాజల్ ఇటీవలే ఓ క్రేజీ ఆఫర్ ని తృణప్రాయంగా వదులుకుందని తెలుస్తోంది.

సీనియర్ హీరో – యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడిగా `అ!` ఫేం ప్రశాంత్ వర్మ ఓ భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ కథానాయిక అనుకున్నారు. కానీ ఎందుకనో చందమామ రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆస్థానంలో  శ్రీయను ఫైనల్ చేశారట. ఈ సినిమాని రాజశేఖర్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారిక వివరాలు తెలియనున్నాయని తెలుస్తోంది. పీఎస్ వీ గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజశేఖర్ మరో క్రేజీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రిపేరవుతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందిట. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*