సూర్పణఖగా మారబోతున్న స్టార్ హీరోయిన్…. ఎందుకో తెలుసా…….?

అందాల భామ చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ మనసు విభిన్న పాత్రల వైపు ఆసక్తి మళ్లినట్లు అర్థమవుతుంది. కాజల్ తన సినిమా కెరీర్ లో చాలా మంది పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. టాలివుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. టాలివుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. కాజల్ తరువాతి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందూ పురాణ గాధ రామాయణంలో రావణుడి సోదరి సూర్పణఖ పాత్ర ఆధారంగా దర్శకుడు భార్గవ్ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.

 ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ని సూర్పణఖ  పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్పణఖ అనగానే రాక్షసుడు అయిన రావణుడి సోదరినిగానే ఊహించుకుంటాం. ఈ సినిమాలో సూర్పణఖని అందాల యువరాణిగా కూడా చూపిస్తున్నారట. అయితే మగధీర సినిమాలో ఇలాంటి పాత్ర కాజల్ అగర్వాల్  ఇంతకుముందే నటించింది. దీనితో ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అయితేనే బాగుంటుందని, ఆమెని అడిగినట్లు తెలుస్తోంది. కాజల్ ఈ ప్రాజెక్ట్ కు సూచన ప్రాయంగా ఓకె చెప్పిందని, అధికారికంగా ఇంకా అంగీకరించబడలేదని సమాచారం. త్వరలో ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోoది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*