కొత్తదనం కోరుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజానీకం

జూబ్లీహిల్స్ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనమేమిటంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల సమస్యల్నీ.. అభివృద్ధినీ.. పట్టించుకోకుండా తమ స్వార్థానికి పదవుల్ని ఉపయోగించుకుంటున్నారు. అలా స్వార్థపూరితమైన వారిని కాకుండా ప్రజల కొరకు, ప్రజల సేవకుడిగా.. ప్రజల కోసమే అంకితమై ఉండే ప్రజా నాయకుడిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.  జూబ్లిహిల్స్ అంటే ధనికుల వర్గం ఉండే ప్రాంతంగా అందరూ భావిస్తారు. కానీ, ఆ నియోజకవర్గంలో అసలు జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం లేదు. 

 

మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలు, అగ్రకులాలలోని పేదల కోసం పనిచేసే నిస్వార్థపూరితమైన నాయకుడు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు పరిపాలించిన నాయకుల్లో అగ్రకులాల నాయకులే ఉన్నారు. ఈ సారైనా బహుజనులకు అవకాశం కల్పించాలి. పేదల కష్టాలెలా ఉంటాయో, ప్రజలు పడే బాధలేంటో వారికే ఎక్కువగా తెలుసు. అందుకే ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు వారికే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*