‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్….!

బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధర.. ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్! యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయనే వార్త అంచనాలను మరింత పెంచేస్తోంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతేకాదు బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది. 

ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు. అంతేకాదు బాహుబలి2 తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుందట. చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.70 నుంచి రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం ‘అరవింద సమేత’పై పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘అరవింద సేమత’పై అంచనాలు క్రియేట్ చేయడంపై దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఎన్టీఆర్ వరస హిట్లతో జోరు మీద ఉండటంతో ‘అరవింద సమేత’ కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

మరోవైపు, త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ తొలి సినిమా ఇది. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్‌తో ఎలాంటి డైలాగులు చెప్పిస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌తో ఆమెకిదే తొలి చిత్రం. పూజా గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై డిస్ట్రిబ్యూటర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారట. మరి నిర్మాతలు ఊహించినట్టు థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాయో చూడాలి. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*